Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్ సర్వే ఫలితాల వెల్లడి
బ్రసీలియా : ఈ నెల 30న జరగబోయే అధ్యక్ష ఎన్నికల రెండో రౌండ్లో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వా ప్రస్తుత అధ్యక్షుడు జేర్ బోల్సనారోపై భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారని బుధవారం విడుదలైన ఇపెక్ ఇనిస్టిట్యూట్ సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఈ రౌండ్లో లూలాకు 51శాతం ఓట్లు వస్తాయని బోల్సనారోకు 43శాతం ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. చెల్లని ఓట్లను పక్కన బెడితే ఈ శాతం మరింతగా పెరిగి, 55-45శాతంగా వుండొచ్చునని సర్వేలో వెల్లడైంది. మొదటి రౌండ్లో బోల్సనారోకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసారీ కూడా అక్కడకే పరిమితమవుతారని సర్వే తెలిపింది. లూలాకి మాత్రం కొద్దిగా ప్రజల మద్దతు పెరిగిందని వెల్లడైంది. ఎన్నికల సందర్భంగా గతంలో నిర్వహించిన ఓపీనియన్ పోల్స్‌లో లూలాపై బోల్సనారో పదికి పైగా పాయింట్లు ఎక్కువ ఆధిక్యతలో కొనసాగుతారని వెల్లడైంది.