Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రస్సెల్స్ : రష్యా ప్రభుత్వంపై, ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని పెంచుతూ కొత్త ఆంక్షలను యురోపియన్ యూని యన్ ఆమోదించింది. ఈ మేరకు ఈయూ వెబ్సైట్లో ఒక ప్రకటన వెలువడింది. తృతీయ దేశాలకు రష్యన్ చమురును రవాణా చేసేందుకు సంబంధించిన ధరలపై నియంత్రణను విధించింది. అలాగే తృతీయ దేశాలకు ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాపై మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యాకి చెందినా లేదా రష్యా నుంచి ఎగుమతి అయ్యే ఉక్కు ఉత్పత్తులపై దిగుమతి నిషేధాన్ని ఇయు విస్తరిం చింది. చెక్క గుజ్జు, కాగితం, సిగరెట్లు, ప్లాస్టిక్స్, కాస్మొటిక్స్, అలాగే ఆభరణాల పరిశ్రమలో ఉపయోగించే వస్తువులు అంటే విలువైన రాళ్ళు, లోహాలు వంటి వాటిపై మరిన్ని ఆంక్షలు విధించారు. వస్తువుల విక్రయం, సరఫరా లేదా ఎగుమతి వంటి వాటిపై పౌర విమానయాన రంగం మరిన్ని ఆంక్షలు ఎదుర్కోనుంది. దీనికి తోడు, మరింత మంది వ్యక్తులపై కూడా ఆంక్షలు విధించారు. వారిలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినవారు వున్నారు. నిర్దిష్ట రష్యా ప్రభుత్వ సంస్థలకు చెందిన సంస్థలు, లేదా సంఘాల బోర్డుల్లో ఇయు జాతీయులు ఎలాంటి పదవులను నిర్వహించరాదని కూడా స్పష్టం చేశారు. రష్యా ఆర్థిక వ్యవస్థను మరింతగా దెబ్బ తీయా లన్నది లక్ష్యంగా వుందని ఇయు దౌత్యవేత్త జోసెఫ్ బారెల్ చెప్పారు. రష్యా ఎగుమతులు, దిగుమతుల సామర్ద్యాన్ని పరిమితం చేయడం, రష్యా ఇంధనంపై ఇయు ఆధారపడడాన్ని మరింత వేగంగా పరిమితం చేయాలన్నది లక్ష్యంగా వుందన్నారు.