Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ :పర్యావరణ లక్ష్యాలపై ప్రపంచ దేశాల సహకారం ప్రమాదంలో పడిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. వచ్చేవారం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌ల సమావేశం జరగ నుండటంతో ఓ నివేదికను విడుదల చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యలకు సంబంధించిన భౌగోళ రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, చైనా-అమెరికాల మధ్య సంబంధాలు క్షీణత వంటి కారణాలు వాతావ రణ లక్ష్యాలను సాధించడంలో ప్రపంచ దేశాల సహకారాన్ని ప్రమాదం లో పడేశాయని పేర్కొంది. గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా పోరాడేం దుకు తక్షణ, విశ్వసనీయమైన, పారదర్శకమైన చర్యలు చేపట్టాల్సి వుంద ని సూచించింది. భారీ నష్టాలతో కూడిన పర్యావరణ విపత్తులను ఎదు ర్కొనేందుకు ఈ చర్యలు అత్యవసరమని పేర్కొంది. ఉష్ణోగ్రతల పెరుగు దల 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండేలా చూసుకునేందుకు తగిన చర్యలు చేపట్టాల్సి వుందని తెలిపింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందు కు కర్బన ఉద్గారాలను (జీహెచ్జీఎస్) తగ్గించాల్సి వుందని సూచించిం ది. అంతర్జాతీయ సమన్వయంతో కర్బన ఉత్పత్తుల పై ప్రతిపాదిత సుంకాలతో అధిక కర్బన ఉద్గారాలను అడ్డుకోవచ్చని పేర్కొంది. విభిన్న అంతర్జాతీయ ప్రమాణాలు ఏర్పడినట్లైతే.. దేశాల మధ్య కర్బన సుంకాల తో అధిక కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా అడ్డుకోవచ్చని తెలిపింది.