Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : చైనాలోని జిన్జియాగ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై చర్చ నిర్వహించాలన్న డిమాండ్‌కు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి గురువారం వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇది, పశ్చిమ దేశాలకు పెద్ద ఎదురు దెబ్బ. చైనాను లక్ష్యంగా చేసుకుంటూ, జిన్‌జియాంగ్‌పై చర్చకు అనుమతించాలని కోరుతూ గత నెలలో అమెరికా దాని మిత్రపక్షాలు మానవ హక్కుల మండలికి తమ ముసాయిదా నిర్ణయాన్ని అందజేశాయి. జిన్జియాంగ్లో ఉయిగర్, ఇతర ముస్లింలకు వ్యతిరేకంగా నేరాలు జరిగే అవకాశాలను పేర్కొంటూ గత నెలలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి చీఫ్ మిచెల్లె బాచ్లెట్ తన నివేదికను విడుదల చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్నఈ నివేదిక విడుదలైన నేపథ్యంలో తాజాగా చర్చ జరగాలన్న డిమాండ్‌ను అమెరికా తెరపైకి తీసుకొచ్చింది. 47 సభ్య దేశాలు కలిగిన మండలిలో భారత్ సహా 11మంది ఓటింగ్‌కు గైర్హాజరు కాగా, 19-17తో వీగిపోయింది.