Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్లో శ్రీలంకపై ప్రవేశపెట్టిన ఓ ముసాయిదా తీర్మానానికి భారత్ గైర్హాజరయింది. శ్రీలంకలో సయోధ్య, జవాబుదారీతనం, మానవహక్కులను ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 47 మంది సభ్యులున్న కౌన్సిల్లో ఈ తీర్మానానికి అనుకూలంగా 20 దేశాలు ఓటువేశాయి. చైనా, పాకిస్థాన్‌తో సహా ఏడు దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్, జపాన్, నేపాల్, కతార్ వంటి 20 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ సందర్భంగా ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి ఇంద్ర మణి పాండే ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీలంక తమిళల చట్టబద్ధమైన ఆకాంక్షలతోపాటు శ్రీలంక ప్రజలందరీ శ్రేయస్సు కోసం సంబంధింత లక్ష్యాలను సాధించడానికి శ్రీలంక, అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ విషయంలో శ్రీలంక తీసుకుంటున్న చర్యలను గమనిస్తున్నామనీ, ఈ చర్యలను మరింత వేగంగా అమలుచేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ తీర్మానానికి అనుకులంగా ఓటువేసిన దేశాల్లో ఇంగ్లండ్, అమెరికా, అర్జెంటీనా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్, పరుగ్వే, పోలాండ్, ఉక్రెయిన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఉన్నాయి.