Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు సార్లు వృద్థి రేటుకు కోత
- వచ్చే వారం మరోసారి తగ్గింపు
- ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టియాన హెచ్చరిక
వాషింగ్టన్ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి ప్రమాదాన్ని ఎదుర్కోనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టియాన జార్జివా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో రెండు త్రైమాసికాల్లో సాపేక్ష మందగమనం నుంచి తీవ్ర అనిశ్చిత్తిలోకి జారుకో నుందని హెచ్చరించారు. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సంయుక్త సమావేశంలో క్రిస్టియాన మాట్లాడుతూ.. వచ్చే వారం ప్రపంచ ఆర్థిక వృద్థిపై ముందస్తు అంచనాలను నివేదికను విడుదల చేయనున్నామన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు ఉన్న దేశాలు తీవ్ర అనిశ్చితి పరిస్థితిని ఎదుర్కోవచ్చ న్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే తాము మూడు సార్లు వృద్థి రేటు అంచనాలకు కోత పెట్టామన్నారు. ప్రపంచ వృద్థి రేటు 2022లో 3.2 శాతానికి, 2023లో 2.9 శాతానికి తగ్గవచ్చ న్నారు. వచ్చే ఏడాది గాను జీడీపీ అంచనాలను తగ్గించామన్నారు. వచ్చే వారం కొత్త అంచనాలను వెల్లడించ నున్నామన్నారు. ''మాంద్యం ప్రమాదా లు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు దేశాలు వచ్చే ఏడాది కనీసం రెండు వరుస త్రైమాసికాల్లో ప్రతికూలతను ఎదుర్కోనున్నాయి. వృద్ధి సానుకూలం గా ఉన్నప్పటికీ, వాస్తవ ఆదాయాలు తగ్గిపోవడం, ధరల పెరుగుదల కారణంగా ఇది మాంద్యాన్ని తలపించ నుంది.'' అని క్రిస్టియాన పేర్కొన్నారు. ఇప్పటి నుంచి 2026 నాటికి 4 లక్షల కోట్ల డాలర్ల నష్టాన్ని చవి చూడనున్నా యని ఆమె అంచనా వేశారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ఎదురు దెబ్బ కానుందన్నారు. కరోనా సంక్షో భానికి తోడు యుద్ధ అంశాలు అనిశ్చితిని మరింత పెంచుతున్నాయ న్నారు. అనేక ఆర్థిక వ్యవస్థలు మరిన్ని సవాళ్లను ఎదుర్కోను న్నాయి. అధిక రుణాలు, నగదు లభ్యత సమస్యలు ఆందోళనలను పెంచనున్నాయని క్రిస్టియాన పేర్కొన్నారు.