Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరణార్ధుల సంక్షోభమే కారణం
న్యూయార్క్ : శరణార్ధుల సంక్షోభం నేపథ్యంలో న్యూయార్క్‌లో 30 రోజుల పాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆదమ్స్ ప్రకటించారు. కొత్తగా వచ్చే శరణార్దుల వల్ల నగరానికి వంద కోట్ల డాలర్లు ఖర్చు అవుతుందన్నారు. దక్షిణాది సరిహద్దుల నుంచి న్యూయార్క్‌తో సహా డెమోక్రాట్ పాలిత ప్రాంతాల్లోకి వేలాదిమంది శరణార్ధులను అనేక రాష్ట్రాలు పంపిస్తున్న నేపథ్యంలో మేయర్ ఈ చర్య తీసుకున్నారు. సిటీ హాల్లో విలేకర్లతో మాట్లాడుతూ మేయర్, ఇదొక మానవతా సంక్షోభమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నగరంలోని షెల్టర్లలో 61వేల మందికి పైగా ఆశ్రయం పొందు తున్నారని చెప్పారు. వారిలో మూడో వంతు మంది పిల్లలేనన్నారు. అమెరికా రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణమని మేయర్ విమర్శించారు. ఎలాంటి నోటీసులు, సమన్వయం, సంరక్షణ లేకుండా, వేలాదిమంది శరణార్ధులు ఇక్కడ ఆశ్రయం కోరుతూ బస్సు ఎక్కి న్యూయార్క్ నగరానికి చేరుకుంటున్నారని అన్నారు. ''ఇక్కడ గల షెల్టర్ చట్టాలు, మా సామాజిక సేవలకు సంబంధించిన నిబంధనలు, మా విలువలు వీటన్నింటినీ ఇతరులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఈ పరిణామాల పట్ల న్యూయార్క్ ప్రజలు చాలా కోపంతో వున్నారని, తనక్కూడా కోపం వస్తోందని అన్నారు. త్వరలోనే శరణార్ధుల సంఖ్య లక్ష దాటనుందన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వందకోట్ల డాలర్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.