Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రక్కు బాంబు పేలడంతో దగ్ధమైన ఆయిల్ ట్యాంకర్ల రైలు
- ముగ్గురు ప్రయాణికుల మృతి
- ఉక్రెయిన్ దుశ్చర్యే : రష్యా
- ఆరంభం మాత్రమేనని ఉక్రెయిన్ వ్యాఖ్య
మాస్కో : యూరప్‌లోనే అత్యంత పొడవైన, రష్యాను క్రిమియా ద్వీపకల్పంతో కలిపే కెర్చ్ రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై శనివారం తీవ్రమైన బాంబుపేలుడు సంభవించింది. తొలుత ట్రక్కు బాంబు పేలడంతో, అటువైపు రైలు బ్రిడ్జిపై వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ల రైలుకు నిప్పంటు కుని తీవ్ర స్థాయిలో విధ్వంసం చోటు చేసుకుంది. మొత్తంగా ఏడు ఆయిల్ ట్యాంకర్లకు మంటలు వ్యాపించాయి. ఈ పేలుడులో ముగ్గురు మరణిం చారని అధికారు లు తెలిపారు. 3.2 మిలియన్ డాలర్ల నుంచి 8 మిలియన్ డాలర్ల వరకూ నష్టం జరిగి ఉంటుం దని అంచనా వేశారు. మృతులు, ట్రక్కు పేలిన సమయంలో పక్కనే ప్రయాణిస్తున్న కారులోని వారై ఉంటారని భావిస్తు న్నారు. ఒక పురుషుడు, ఒక మహిళ మృతదేహాల ను నది నుంచి వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడుతో వంతెనపై భారీగా మంటలు ఎగసి పడ్డాయి. మంటల తీవ్రతకు బ్రిడ్జిపై కొంత భాగం కూలి సముద్రంలో పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. స్థానిక కాల మానం ప్రకారం ఉదయం ఆరు గంట ల సమయంలో ట్రక్కు బాంబు పేలిం దని రష్యా జాతీయ తీవ్రవాద నిరోధక కమిటీ తెలిపింది. ఒక వాహనం పేలిన దృశ్యం సిసిటివి వీడియోలో కూడా నమోదైంది. రష్యాలోని క్రాస్నో డార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ వాహన యజమానిగా గుర్తించామని, అతని ఇంటిలో సోదాలు జరుపుతున్నా మని అధికారులు చెప్పారు. ఈ పేలు డుకు సంబంధించిన దృశ్యాలు సామా జిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నా యి. ప్రస్తుత పేలుడుతో రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశ ముంది. కెర్చ్ జల సంధిపై నిర్మించిన, 19 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్ కమ్ రైలు వంతెన 2020లో పూర్తిగా అమల్లోకి వచ్చింది. పేలుడు జరిగిన వెంటనే వంతెనపై ట్రాఫిక్‌ను నిలుపు చేశారు. వంతెనకు మరమ్మతులు చేసేలోగా ఫెర్రీ సర్వీసు ప్రారంభిస్తామని క్రిమియా అధికారు లు తెలిపారు. బ్రిడ్జికి సంబంధించిన షిప్పింగ్ సెక్షన్ ఆర్చ్ దెబ్బతినలేదని అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్ దుశ్చర్యే : మాస్కో
ఇది ఉక్రెయిన్ పాల్పడిన తీవ్ర వాద దుశ్చర్యే అని మాస్కో వ్యాఖ్యా నించింది. ఈ దాడి పట్ల ఉక్రెయిన్ అధికారిక స్పందన ఆ విషయాన్ని రుజువు చేస్తోందని పేర్కొంది.
ఇది ఆరంభం మాత్రమే : ఉక్రెయిన్ అధ్యక్షుడి సహాయకుడు ట్వీట్
ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఉక్రెయిన్ నేరుగా ప్రకటించ నప్పటికీ, 'ఇది కేవలం ఆరంభం మాత్రమే'నని అధ్యక్షుడు జెలెన్స్కీ సహాయకుడు మిఖాయిల్ పొదొలిక్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా దీనిపై ట్వీట్ చేసింది. 'క్రిమియాలో రష్యా అధికార చిహ్నాలైన గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్ మొస్కొవా, కెర్చ్ బ్రిడ్జి రెండూ పోయాయి.