Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీవ్ సహా పలు నగరాలపై పడిన 75 క్షిపణులు
- ఐదుగురు మృతి, భారీగా ఆస్తి నష్టం
- కీలక మౌలిక సదుపాయాల ధ్వంసం
కీవ్ : ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. యూరప్‌లోనే అత్యంత పొడవైన వంతెనను ధ్వంసం చేయడానికి కీవ్ ప్రయత్నించిన నేపథ్యంలో రష్యా ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్ వ్యాప్తంగా పలు నగరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడి జరిగిందని స్థానిక అధికారులు, మీడియా తెలిపారు. ఎక్కడ చూసినా నల్లని దట్టమైన పొగ ఆకాశంలోకి లేవడం కనిపిస్తోంది. ఈ దాడుల్లో ఆస్తి నష్టం కూడా బాగా జరిగింది. పలుచోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో కొన్ని రైళ్లు రద్దయ్యాయి. వ్యూహాత్మకమైన క్రిమియా వంతెనను బాంబు దాడితో ధ్వంసం చేయడాన్ని ఉక్రెయిన్ తీవ్రవాద దుశ్చర్యగా రష్యా అభివర్ణించింది. 75 క్షిపణులు నగరాలపై పడ్డాయని ఉక్రెయిన్ సాయుధ బలగాల కమాండర్ ఇన్ చీఫ్ వ్లాదిమిర్ జెలెన్స్కీ కార్యాలయం తెలిపింది. మరో 41 క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నాయని పేర్కొంది. 11 కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఐదుగురు మరణించారని ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.15గంటలకు పేలుళ్లు మొదలయ్యాయి. అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ దాడులను ధ్రువీకరించారు. దేశంలో పలు ప్రాంతాల్లో మంటలు లేచాయన్నారు. ఇంధన మౌలిక సదుపాయాలను రష్యా లక్ష్యంగా చేసుకుందని వ్యాఖ్యానించారు.