Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్తలు
రోమ్ : ఇక్కడ, అక్కడా అని తేడా లేకుండా ప్లాసిక్ట్ భూతం సర్వత్రా వ్యాపిస్తోందనే మనం ఇంతవరకు చదివాం. కానీ తల్లి పాలల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ని కనుగొన్నామని శాస్త్రవేత్తలు హెచ్చరించడం నిపుణులను సైతం నివ్వెరపరుస్తోంది. దీంతో నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితులపై భయాందోళనలు పెరుగుతున్నాయి. బిడ్డలకి జన్మనిచ్చిన వారం రోజులకు ఇటలీలో 34మంది ఆరోగ్యవంతులైన తల్లుల పాల నుంచి నమూనాలను సేకరిస్తే వారిలో మూడు వంతుల మంది పాలల్లో మైక్రోప్లాస్టిక్స్ అవశేషాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. శిశువులు ప్రధానంగా రసాయనాల కలుషితాలకు గురవుతారు. అందువల్ల అత్యవసరంగా దీనిపై మరింతగా పరిశోధనలు జరగాల్సిన అవసరం వుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మైక్రోప్లాస్టిక్స్ కారణంగా కలుషితమవుతాయనే ఆందోళన వున్నప్పటికీ తల్లి పాలు అన్నింటికంటే అత్యుత్తమమైనవేనని వారు నొక్కి చెప్పారు.