Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : భారత ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు మరింత పెరుగుతున్నాయని అంతర్జాతీయ ఎజెన్సీలు విశ్లేషిస్తున్నాయి. దేశ వృద్థి రేటు అంచనాలకు వరుసగా కోత పెడుతున్నాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) 2022-23కు గాను భారత జిడిపి 6.8 శాతానికే పరిమితం కానుందని మంగళవారం ఓ రిపోర్టులో విశ్లేషించింది. ఇంతక్రితం జులై నాటి 7.4 శాతం అంచనాలతో పోల్చితే 0.6 శాతం లేదా 60 బేసిస్ పాయింట్లు కోత పెట్టినట్లయ్యింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ తమ అంచనాల కంటే బలహీనంగా చోటు చేసుకుందని ఐఎంఎఫ్ తన వాల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ (డబ్ల్యుఇఒ) రిపోర్టులో తెలిపింది. ఇంతక్రితం 8.2 శాతం వృద్థి ఉండొచ్చని ఈ ఏడాది జనవరిలో పేర్కొంది. దీంతో పోల్చితే తాజా గణాంక అంచనాలు ఆర్థిక వ్యవస్థలో మరింత ఆందోళనను పెంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.