Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ప్రపంచంలోనే అతి పెద్దదైన జాతీయ పార్క్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని నేషనల్ పార్క్‌లను నిర్మించాలని చూస్తున్నట్లు చైనా అధికారులు తెలిపారు. తొలి బ్యాచ్‌లో భాగంగా దేశంలో జాతీయ పార్క్‌ల ఏర్పాటు చేపట్టి ఇప్పటికి ఏడాది గడిచింది. ఈ కాలంలో ఆయా నేషనల్ పార్కుల్లో వన్య ప్రాణుల సంఖ్య బాగా పెరిగింది. 2021 అక్టోబరు 12న ఐదు నేషనల్ పార్క్‌లను అధికారికంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుండి పర్యావరణ రక్షణ రంగం లో గణనీయమైన పురోగతి సాధించామని నేషనల్ పార్క్ అధికారులు తెలిపారు. వీటిల్లో పులులు, చిరుతలు, పాండాలకు సంబంధించిన రిజర్వ్ పార్కులు కూడా వున్నాయి. మొత్తంగా పది ప్రావిన్స్‌ల్లో 2,30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ పార్కులు వున్నాయి. ఉత్తర చైనా నుండి దక్షిణ చైనా వరరకు ఇవి విస్తరించాయి. ఈ భూతలంపై గల కీలకమైన రకాలకు చెందిన వన్య ప్రాణుల్లో దాదాపు 30శాతాన్ని ఈ పార్కులు కాపాడుతున్నాయి. నేషనల్ పార్క్ ఆఫ్ హైనన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్‌లో గత ఒక్క ఏడాదిలోనే 28 కొత్త జాతుల వన్యప్రాణులను కనుగొన్నారు.