Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో 8.2 శాతంగా నమోదయ్యింది. ఇంతక్రితం మాసంలోనూ 8.3 శాతంగా చోటు చేసుకుంది. ఇంతక్రితం జూన్లో ఏకంగా 9.1 శాతానికి ఎగిసింది. అహార, ఇంధన, అద్దెల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. కాగా.. ఆగస్టుతో పోల్చితే సెప్టెంబర్లో అత్యంత స్వల్పంగా తగ్గింది. అధిక ధరల కట్టడికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ 75 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు పెంచిన ధరల్లో పెద్ద మార్పు రాకపోవడం గమనార్హం.