Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన దేశమని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యాఖ్యానించారు. ఆయన కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో డెమోక్రటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశంలో మాట్లాడారు. 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాద కర దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. ఇతర దేశాలతో ఎలాంటి సమన్వ యం లేకుండా పాక్ అణ్వాయుధాలను కలిగి ఉంది.' అని బైడెన్ అన్నా రు. అయితే పాకిస్తాన్ అణ్వాయుధాలకు అమెరికా ఆర్థిక సహాయం చేస్తున్న నేపథ్యంలో తాజాగా బైడెన్ వ్యాఖ్యలు పాక్‌కి షాక్ ఇచ్చాయి. ఈ సమావేశంలో ఆయన ఇతర దేశాలతో ఉన్న దౌత్య సంబంధాల గురించి కూడా ప్రస్తావించారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.