Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టర్కీలో 40 మంది దుర్మరణం
టర్కీ : టర్కీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర బార్టిన్ ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 40 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గనుల్లోనే చిక్కుకున్నారు. ఈ ఘటనలో 11 మందిని రక్షించి చికిత్స అందిస్తున్నామని టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు. సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో దాదాపు 110 మంది గనిలో పని చేస్తున్నారని.. వారిలో దాదాపు సగం మంది 300 మీటర్ల లోతులో ఉన్నట్టు తెలిపారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించనున్నట్టు బార్టిన్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ శనివారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. 'మేం మొత్తం 40 మంది చనిపోయినట్టు గుర్తించాం. 58 మంది మైనర్లు స్వయంగా రక్షించగలిగం. వారికి ధన్యవాదాలు. 28 మంది వ్యక్తులు తమంతట తాముగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఘోరమైన ఈ పారిశ్రామిక ప్రమాదాలలో అనేక మంది గాయపడ్డారు' అని ఆరోగ్య మంత్రి తెలిపారు.