Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 600 మందికిపైగా మృతి
అబూజ: నైజీరియాను వరద లు ముంచెత్తాయి. ఈ భారీ వరదల కారణంగా ఆ దేశంలో ఇప్పటివరకు 600 మందికి పైగా మృతి చెందిన ట్టు సమాచారం. గ్రామాలు వరదల తో మునిగిపోయాయి. గత నాలుగు రోజులుగా వరదలు ముంచెత్తుతున్నా... పలు రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టకపోవడం వల్లే మృతుల సంఖ్య భారీగా పెరిగి నట్టు సమాచారం. వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయుల య్యారు. అక్కడి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
నైజీరియా మానవతా వ్యవహారాలు, విపత్తు నిర్వహణ మంత్రి సదియా ఉమర్ ఫరూక్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఖాళీ చేయించాలని స్థానిక అధికారులను సూచిం చారు. దేశంలోని 36కుగాను 27 రాష్ట్రాలపై ఈ వరద ప్రభావం పడిం ది. అయితే ఇంత స్థాయిలో వరదలు సంభవించ డానికి భారీ వర్షాలు, వాతావరణ మార్పులే కారణమని సంబంధిత అధికారులు చెబుతు న్నారు. దేశంలోని దక్షిణాన ఉన్న కొన్ని రాష్ట్రాల్లో నవంబర్ చివరి వరకు వరదలు కొనసాగవచ్చని నైజీరియా వాతావరణ సంస్థ హెచ్చరించింది. సరిగ్గా పదేండ్ల క్రితం ఇదే మాదిరిగా వరదలు సంభవించి దాదాపు 360 మంది చనిపోగా.. 2 లక్షల మంది నిరాశ్రులయ్యారు.