Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్డీఏ పోల్లో వెల్లడి
బ్రసీలియా : బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధి లూలా డసిల్లా ముందంజలో వున్నారని ఎండిఎ పోల్లో వెల్లడైంది. అన్ని పరిస్థితుల్లోనూ, లూలా ఆరు పర్సంటేజ్ పాయింట్ల ఆధిక్యతలో వుంటా రని పోల్ ఫలితాలు వెల్లడించాయి. జాతీయ రవాణా సమాఖ్య (సిఎన్టి) ప్రారంభించిన ఎమ్డిఎ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో వర్కర్స్ పార్టీ నేత లూలాకు 53.5శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు లిబరల్ పార్టీ మితవాద అభ్యర్ధి జేర్ బోల్సనారోకు 46.5శాతం ఓట్లే లభించాయి.
చెల్లుబాటైన ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఫలితాలు ఈ రీతిన వున్నాయి. మొత్తం ఓట్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నపుడు, అభ్యర్ధుల పేర్లను ఓటర్లకు వెల్లడించినపుడు లూలాకు 48.1శాతం ఓట్లు రాగా, బోల్సనారోకి 41.8శాతం ఓట్లు లభించాయి. అభ్యర్ధుల పేర్లను వెల్లడించకుండా చూసినట్లైతే లూలాకు 46.4శాతం, బోల్సనారోకి 40.6శాతం ఓట్లు లభించాయి. ఈ నెల 30న రెండో రౌండ్లో ఎన్నికలు జరగనున్నాయి.