Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిపుణుల వ్యాఖ్యానాలు
బీజింగ్: హాంకాంగ్, మకావులకు సంబంధించిన కార్యకలాపాలకు, ఒక దేశం, రెండు వ్యవస్థలకు, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం మహత్తర ఆవిష్కరణకు ప్రాథమిక పునాదిగా, మార్గదర్శకంగా జిన్‌పింగ్ మహాసభల్లో ప్రవేశపెట్టిన నివేదిక పనిచేస్తుందని నిపుణులు, అధికారు లు వ్యాఖ్యానిస్తున్నారు. సుదీర్ఘకాలం ఈ నివేదికకే కట్టుబడి వుండాల్సి వుంటుందని పేర్కొంటున్నారు. రెండు ప్రత్యేక పాలనా ప్రాంతాలు (ఎస్ఏఆర్ఎస్) తిరిగి మాతృభూమికి చేరుకున్నప్పటి నుండి ఒకదేశం రెండు వ్యవస్థలకు విస్తృతమైన గుర్తింపు లభించింది. 2019లో హాంకాంగ్‌లో సామాజిక సంక్షోభం సమయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగ్, పార్టీ కేంద్ర కమిటీలు పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి, నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. ఈ పరిస్థితులకు గల మూల కారణాలను కనుగొని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. హాంకాంగ్‌కు జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయడంతో సహా ఎన్నికల సంస్కరణలు, హాంకాంగ్ ప్రత్యేక పాలనా ప్రాంతంలోని చైనా వ్యతిరేక శక్తులను అణచివేయడం వరకు అనేక చర్యలు తీసుకున్నారని హాంకాంగ్ స్టేట్ కౌన్సిల్, మకావు అఫైర్స్ ఆఫీస్ అధిపతి జియా బాలాంగ్ తెలిపారు. ఆదివారం గ్రూపు చర్చల్లో పాల్గొన్న ఆయన దక్షిణ చైనాలోని గుయాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కి చెందిన ప్రతి నిధు లతో చర్చలు జరిపారు. తీసుకున్న ఈ చర్యల కారణంగా హాంకాంగ్ లో పరిస్థితులు మారాయి. గతంలో గందరగోళం, అల్లర్ల నుంచి ఇప్పుడు సంక్షేమం, సౌభాగ్యం దిశగా పయనిస్తోంది. హాంకాంగ్, మకావు సంబం ధిత కార్యకలాపాల్లో అనేక పురోగతులు సంభవించాయి. గణనీయ మైన ఫలితాలు వచ్చాయని జియా తెలిపారు. ఒక దేశం, రెండు వ్యవస్థ ల విధానాన్ని పరిరక్షించుకుంటూ, మెరుగుపరుచుకోవాల్సిన అవసరా న్ని ఆయన నొక్కి చెప్పారు.
ఒక దేశం, రెండు వ్యవస్థల పట్ల మనకు పూర్తిగా విశ్వాసం వుండాలని, వాటిని ధృఢంగా అమలు చేయడానికి కృత నిశ్చయులై వుండాలని జిన్‌పింగ్ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ విధానానికి సుదీర్ఘకాలం కట్టుబడి వుండడం వల్ల హాంకాంగ్ సమాజం లో కొన్ని రంగాల్లో నెలకొన్న ఆందోళనలు కూడా తొలగిపోతాయని హాంకాంగ్ నిపుణుడు లీ జియావోబింగ్ వ్యాఖ్యానించారు.