Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో:2022 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్‌ను శ్రీలంక రచయిత షెహన్ కరుణతిలక గెలుచుకు న్నారు. ఆయన రాసిన 'ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మేడా' పుస్తకం ఈ బహుమతి కి ఎంపికైంది. దేశ అంతర్యుద్ధంలో హత్యకు గురైన ఓ ఫోటో గ్రాఫర్ గురించి ఈ పుస్తకంలో వివరించారు. ఫోటోగ్రాఫర్, గాంబ్లర్ అయిన మాలి అల్మెడా హత్యకు గురవుతారు. మరణించిన తర్వాత తన హత్యకు బాధ్యులు ఎవరు అనేది తెలుసుకునేందుకు ఆయన చేసిన యత్నాలను ఈ నవలలో వివరించారు. ఆయన రాసిన 'ది లెజెండ్ ఆఫ్ ప్రదీప్ మాథ్యూ' పుస్తకం కామన్వెల్త్ బహుమతి, ది డిఎస్సి ఫ్రైజ్, ది గ్రేటీయన్ ఫ్రైజ్లను గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకున్న రెండో శ్రీలంక రచయితగా కరుణ తిలక రికార్డు సృష్టించారు.
లండన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక వేడుకలో క్వీన్ కన్సార్ట్ కెమిల్లా నుంచి ఈ పురస్కారం అందుకున్నారు. బహుమతి కింద ఆయనకు 50,000 పౌండ్లు అందజేశారు. 2019లో ఆయనకు ఆంగ్ల భాషా సాహిత్య పురస్కారం దక్కింది. కాగా, 1992లో ఇంగ్లీష్ పేషెంట్ నవల రాసిన రచయిత మైఖేల్ ఒండాజే శ్రీలంక నుంచి బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి రచయితగా నిలిచారు.