Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర చర్యలు : అమెరికా
వాషింగ్టన్: యుద్ధ నేరాలకు రష్యానే జవాబుదారీ అని అమెరికా పేర్కొంది. ఇరాన్ డ్రోన్ ప్రోగ్రామ్‌తో పనిచేస్తున్న కంపెనీలు మరియు దేశాలపై చర్య తీసుకుంటామని వెల్లడించింది. తాజాగా రష్యా చేపడుతున్న దాడులను అమెరికా తీవ్రంగా ఖండిస్తోందని బైడెన్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్- పియర్ పేర్కొన్నారు. ఈ దాడులతో పుతిన్ క్రూర త్వాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు తమ మద్దతు కొనసాగిస్తామని చెప్పారు. రష్యాను జవాబుదారీగా చేస్తూ.. రష్యాపై ఆంక్షలను కొనసాగిస్తామని అన్నారు. ఇటీవల ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై ఆత్మాహుతి డ్రోన్లతో దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే.