Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్‌లో కార్మికుల సమ్మెలు
- ద్రవ్యోల్బణం..ఇంధన సంక్షోభం..
- పెరుగుతున్న జీవన వ్యయం
- వేతనాలు పెంచాలంటూ డిమాండ్
- అన్నీ రంగాలకూ పాకిన నిరసనలు
పారిస్ : ఐరోపాలోని ప్రధాన దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్‌లో కార్మిక లోకం కదం తొక్కింది. ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం, పెరుగుతున్న జీవన వ్యయాలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతున్నది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను భయపెట్టిస్తున్నది. దీంతో ఇవి దేశవ్యాప్తంగా కార్మికుల నిరసనలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వేతనాల పెంపు కోసం వారంతా డిమాండ్ చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఏర్పడిన ఇంధన సంక్షోభమూ పుండు మీద కారం చల్లిన పరిస్థితిని ఫ్రాన్స్‌లో ఏర్పర్చింది. ఐరోపాలో రాబోయే కఠినమైన శీతాకాలపు హెచ్చరికల నేపథ్యంలో ఈ కఠిన పరిస్థితులు ఎదురుకావటం ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫ్రెంచ్ సమ్మెలు ఎలా ప్రారంభమయ్యాయి?
ఈ సమ్మెలు ముఖ్యంగా రిఫైనరీ కార్మికులతో కొన్ని వారాల క్రితం మొదలయ్యాయి. అధిక వేతనాలను డిమాండ్ చేస్తూ వారు ఈ సమ్మెకు దిగారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవటంతో దాని ప్రభావం యూరప్‌లో ఇంధనం, శక్తిపై ప్రభావం పడింది. దీనిని అక్కడి ఆయిల్, గ్యాస్ కంపెనీలు క్యాష్ చేసుకొని లాభాలను గడిస్తున్నాయన్నది రిఫైనరీ కార్మికుల వాదన. కాగా, కార్మికుల సమ్మెలు ఫ్రాన్స్‌లో ఇంధన కొరతలకు దారి తీశాయి. పెట్రోల్ పంపుల ముందు భారీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. కొన్ని పెట్రోల్ పంపులైతే కనీసం ఇంధనం లేకుండా కనిపించాయి. ఆదివారం నాటికి మూడో వంతు దేశ గ్యాస్ స్టేషన్లు ఇంధనం అయిపోయి కనిపించాయి. ఇంధన కొరత, కార్మికుల సమ్మెలు.. వెరసి ఈనెల 18న నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే, రాబోయే కఠిన శీతాకాల పరిస్థితులను ఎదుర్కోవటం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది.
సమ్మెకు వెళ్లిందెవరు?
రిఫైనరీ, ఆయిల్ డిపార్ట్మెంటు కార్మికులతో మొదలైన సమ్మెలు దేశంలోని ఇతర పరిశ్రమలకూ వ్యాపించాయి. ఈ సమ్మెలు ఫ్రెంచ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల పైనా ప్రభావం చూపాయి. ఇక్కడ కూడా కార్మికులు అధిక వేతనాలను కోరారు. మంగళవారం రైల్వే కార్మికులు, హైస్కూల్ విద్యార్థులు.. ఇలా వేలాది మంది ప్రజలు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. ఇది రవాణాకు అంతరాయాన్ని కలిగించింది. ఆదివారంనాడు ప్యారిస్‌లో భారీ మార్చ్‌ను నిర్వహించారు. పెరుగుతున్న జీవన వ్యయం కూడా అక్కడి కార్మికులు, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇక మరిన్ని నిరసనలు, చర్యలకు యూనియన్లు హామీనిచ్చాయి. దేశంలోనే అతిపెద్ద యూనియన్లలో ఒకటైన సీజీటీ సమ్మెలకు సహాయాన్ని అందిస్తున్నది. మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన 180కి నిరసనల్లో 70వేల మంది ఒక్క ప్యారిస్‌లోనే పాల్గొనటం గమనార్హం. అయితే, దీనిపై అక్కడి ప్రభుత్వం మాత్రం తప్పుడు సమచారాన్ని చెప్తున్నది. దేశవ్యాప్త నిరసనల్లో 1.07 లక్ష మంది మాత్రమే పాల్గొన్నారనీ, ప్యారిస్‌లో పాల్గొన్నవారి సంఖ్య 13వేలేనని అంచనా వేసింది.
ద్రవ్యోల్బణం నిరసనలకు దారి తీస్తుందా?
ద్రవ్యోల్బణంతో దెబ్బతిన్న కొనుగోలు శక్తి ఫ్రెంచ్కు ప్రధాన ఆందోళనగా మారింది. ఈనెలలో ప్రకటించిన ఒక సర్వేలో చాలా మంది ఇమ్మిగ్రేషన్, నేరాల కంటే మూడు రెట్లు ఎక్కువ ఆందోళనను కలిగి ఉన్నారు. ప్రభుత్వం గ్యాసోలిన్ ధరలు, ఇంధన బిల్లులను సబ్సిడీపై బిలియన్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ, అనేక సూపర్ మార్కెట్ కనీస ధరలు పెరగటం గమనార్హం. ఐరోపా ఇంధన సంక్షోభం, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అరికట్టడానికి ఫ్రాన్స్ అనేక దేశాల కంటే సాహసోపేతమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. దీర్ఘకాలంలో అది సరిపోతుందా? అనే ప్రశ్నలు ఆర్థిక నిపుణుల నుంచి ఎదురవుతున్నాయి.
మాక్రాన్‌కు గడ్డు పరిస్థితి
ఉక్రెయిన్‌లో సంఘర్షణ ఐరోపాలో శక్తి సరఫరాకు తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. సహాజవాయువు ధరల పతనం 2021 స్థాయిలకు పరిమితం చేయబడ్డాయి.