Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జకార్తా : కొన్ని సిరప్‌లతో పిల్లలు తీవ్రమైన కిడ్నీ వ్యాధులకు (ఏకేఐ) గురవుతున్నట్టు ఇండోనేషియా ప్రభుత్వం గుర్తించింది. సిరప్‌ల వాడకం తో మృత్యువాత పడుతున్న చిన్నారుల సంఖ్య ఈ ఏడాది 99కి చేరింది. ఈ ఘటనపై చేపట్టిన దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది చిన్నారుల ఇండ్లలో వాడుతున్న సిరప్‌లలో ఇథిలీన్ గ్లైకాల్, ఢైథిలిన్ గ్లైకాల్‌లను గుర్తించినట్టు ఇండోనేషియా ఆరోగ్యమంత్రి బుడి గునాడి సాదికిన్ తెలిపారు. ఎలా గుర్తించారన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. గురువారం నాటికి దేశంలో 206 ఏకేఐ కేసులను గుర్తించామని, వారిలో 99 మంది మర ణించారని అన్నారు. వాస్తవ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అన్ని సిరప్ ఆధారిత మందుల విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించినట్టు ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది. చిన్నారుల్లో జర్వం చికిత్సకు వినియోగించే డైధైలీన గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ కలిగి వున్న పారాసెటమాల్ సిరప్‌లను కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నిర్దిష్ట ఉత్పత్తులు స్థానికంగా అందుబాటులో లేవని ఇండోనేషియా ఫుడ్ అండ్ డ్రగ్ ఏజన్సీ తెలిపింది. గాంబియాలో 70 మంది చిన్నారులు మరణించడంతో పారాసెటమాల్ సిరప్‌లతో సంబంధం ఉన్న పిల్లల ఎకెఐ మరణాలపై దర్యాప్తు చేపడుతోంది. న్యూఢిల్లీకి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఈ సిరప్‌లను తయారు చేసిందని, దీనిపై దర్యాప్తు జరుతోందని భారత్ తెలిపింది.