Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభంతో అక్కడి ప్రజలు పస్తులు ఉంటున్నట్టు ఓ అధ్యయనం తెలిపింది. కన్జర్వే టివ్ పార్టీకి చెందిన లిజ్ ట్రస్ ప్రధాని అయిన తర్వాత అక్కడ విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయడంతో రానున్న కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఆహార ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు భోజనాన్ని మానుకుంటున్నారని విజ్ కన్జ్యూమర్ గ్రూప్ తెలిపింది. సుమారు 3వేల మందిపై సర్వే చేపట్టినట్టు పేర్కొంది. సెప్టెంబర్ నెలలో బ్రిటన్‌లో ద్రవ్యోల్భణం 10శాతానికన్నా ఎక్కువైంది. దీంతో ఆహారధరలు తీవ్రంగా పెరిగాయి. గతంతో పోలిస్తే ప్రజలు ఆరోగ్యకరమైన భోజనానికి తక్కువ ఖర్చు పెడుతున్నారనీ, 80 శాతం మంది ప్రజలు ఆర్థికంగా కష్టపడుతున్నారని పేర్కొంది. లిజ్ ప్రభుత్వం ఈ వారం ఇంధన ధరలను ఫ్రీజ్ చేయడంతో మిలియన్ల మంది ప్రజలు కనీసం తమ ఇళ్లలో వేడిని ఏర్పాటు చేసుకోలేకపోతు న్నారని సర్వే వెల్లడించింది. ఏప్రిల్‌లో సార్వత్రిక ఇంధన మద్దతును నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఇంధన పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని విజ్ పాలసీ మరియు న్యాయ అధిపతి రోసియో హెచ్చరిం చారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో బ్రిటన్‌తో పాటు చాలా యూరోపియన్ దేశాలు ఆర్థికంగా కుదేలు అవుతున్నాయి. చాలా యూరోపియన్ దేశాల్లో తీవ్ర ఇంధన సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. వచ్చే శీతాకాలంలో చల్లని వాతావరణం నుండి యూరప్ వాసు లు ఎలా బయటపడతారో చూడాలని పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం ముంగిట ఉన్న బ్రిటన్ వద్ధి రేటు కూడా క్షీణిస్తుందని ఐఎంఎఫ్ ప్రిడిక్షన్స్ చెబుతున్నాయి. 2023లో బ్రిటన్ వద్ధి రేటు 5 కన్నా దిగువనే ఉంటుందని వెల్లడించింది. మరోవైపు ఇటీవల లిజ్ ట్రస్ ప్రభుత్వం తీసుకువచ్చని బడ్జెట్ వివాదానికి కారణం అయింది. పన్నుల కోత వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇప్పటికే బ్రిటన్ హౌం మంత్రి సౌల్లా బ్రేవర్మాన్ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.