Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తిరిగి రావాలనిభావిస్తున్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. తన వారసురాలిగా వచ్చిన లిజ్ ట్రస్ 44 రోజుల్లోనే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో జాన్సన్ ఈ విషయమై మల్లగుల్లాలు పడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ లండన్, ఇతర మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పలువురు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఇప్పటికే ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం డొమినికన్ రిపబ్లిక్లో సెలవులు గడుపుతున్న జాన్సన్ వెనక్కి వచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేయాలా? వద్దా? అనిఆలోచిస్తున్నారని టైమ్స్ ఆఫ్ లండన్ తెలిపింది.
వచ్చే వారానికల్లా కొత్త నేతను ఎన్నుకోవాలనిటోరీలు భావిస్తున్నారు. పార్లమెంట్లో కనీసం వందమంది సభ్యులు నామినేట్ చేసే అభ్యర్థులనే పరిశీలించాలని టోరీలు భావిస్తున్నారు. అదే గనుక అయితే కేవలం ముగ్గురు అభ్యర్ధులు మాత్రమే బరిలో వుండే అవకాశం వుంది. ఒకవేళ ఒక్కరే అభ్యర్ధికి అవసరమైన మెజారిటీ వస్తే సోమవారానికల్లా కొత్త నేత ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు.