Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 20వ జాతీయ మహాసభ అధ్యక్షవర్గం శుక్రవారం ఉదయం మూడవ సమావేశాన్ని జరిపింది. ఈ సమావేశానికి జిన్పింగ్ అధ్యక్షత వహించారు. 20వ సీపీసీ కేంద్ర కమిటీ, కేంద్ర క్రమశిక్షణా సంఘం (సీసీడీఐ) సభ్యులు, ప్రత్యామ్నాయ సభ్యులకు అభ్యర్ధులుగా ముసాయిదా జాబితాలను సమావేశం ఆమోదించింది. ఈ జాబితాలను చర్చల నిమిత్తం ప్రతినిధులకు అందచేయాలని కూడా అధ్యక్షవర్గ సమావేశం నిర్ణయించింది. మహాసభకు హజరైన ప్రతినిధులు నిర్వహించిన పోటీ ప్రాథమిక ఎన్నికల ద్వారా ఈ జాబితాలు రూపొందాయి. మహాసభ ఎన్నికల పద్దతులకు అనుగుణంగా బ్యాలట్ పరిశీలకుల పర్యవేక్షణ కింద ప్రాథమిక ఎన్నికలు నిర్వహించబడ్డాయి. నామినీల్లో 8శాతానికి పైగా ఎన్నికల్లో ఓటు వేశారు. ఆ ప్రాథమిక ఎన్నికల ఫలితాలు చెల్లుబాటవుతాయని అధ్యక్షవర్గం పేర్కొంది. శనివారం ఉదయం పార్టీ కేంద్ర కమిటీకి, సీసీడీఐకి లాంఛనంగా ఎన్నికలు జరుగుతాయి.