Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : మహిళల హక్కులను తుంగలో తొక్కడం, లోతుగా వేళ్లూనుకున్న స్త్రీద్వేషం నేటి ప్రపంచ సవాళ్లకు అనేక విధాలుగా అనుసంధానించబడి ఉన్నాయని యూఎన్ డిప్యూటీ సెక్రెటరీ జనరల్ తెలిపారు. మహిళలు, శాంతి, భద్రతపై యూఎన్ భద్రతా మండలి సమావేశంలో అమీనా మొహమ్మద్ మాట్లాడుతూ.. ''లింగ సమానత్వం స్థిరమైన శాంతి, సంఘర్షణల నివారణకు మార్గాన్ని అందిస్తుందని దశాబ్దాల సాక్ష్యాలున్నప్పటికీ మనం వ్యతిరేక దిశలో పయనిస్తున్నాం. పితృస్వామ్య విధ్వంసక ప్రభావాల నుంచి మహిళల గొంతులను నొక్కటం నుంచి మన ప్రపంచంలోని శాంతి ప్రమాదకరమైన స్థితిని మనం వేరు చేయలేము. 1995 నుంచి 2019 మధ్య లింగ సమానత్వ నిబంధనలతో శాంతి ఒప్పందాల శాతం 14 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. కానీ, మహిళలు ప్రధాన శాంతి ప్రక్రియలలో సగటున కేవలం 13 శాతం మంది సంధానకర్తలు, ఆరు శాతం మధ్యవర్తులు ఉన్నారు. 70 శాతం శాంతి ప్రక్రియలో ఎవరూ లేరు. మనకు పూర్తి లింగ సమానత్వం అవసరం.'' అని ఆమె తెలిపింది. మహిళలు, శాంతిభద్రతలకు తగిన నిధులనివ్వాలని యూఎన్ ఉమెన్ ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ సిమా బహౌస్ అన్నారు.