Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలన్ మస్క్ అంచనా
ఫ్లోరిడా : ప్రస్తుత మందగమన కాలం వచ్చే ఏడాదిన్నర వరకు కొనసాగవచ్చని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. 2024 మార్చి వరకు మాంద్యం ఉండొచ్చని అంచనా వేశారు. యూరప్, చైనాల్లో టెస్లా వాహనాల అమ్మకాల తగ్గుదలపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మస్క్ పైవిధంగా స్పందించారు. స్థూల ఆర్థిక వ్యవస్థలోని అస్థిరత వల్ల విద్యుత్తు వాహనాలకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని గడిచిన జులైలో తన వాటాదారులతో పేర్కొన్నారు.
ట్విట్టర్లో 75 శాతం ఉద్యోగులపై వేటు..!
టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే 75 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నారని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో తెలిపింది. ప్రస్తుతం ఇందులో 7500 మంది పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో ట్విటర్‌కు యాజమాని ఎవరైనా ఉద్యోగుల కుదింపు ఉంటుందని పేర్కొంది. దాదాపు పావు శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని ప్రస్తుత యాజమాన్యం కూడా యోచిస్తోంది.