Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జింబాబ్వే చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి
పెర్త్: టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. 2009 టి20 ఛాంపియన్ పాకిస్తాన్ జట్టు ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 130పరుగులే చేసింది. జింబాబ్వే జట్టులో విలియమ్సన్(31), ఎవాన్స్(19), ఎర్విన్(19) బ్యాటింగ్‌లో రాణించగా.. మహ్మద్ వాసింకు నాలుగు, షాదాబ్ ఖాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 8వికెట్లు కోల్పోయి 129పరుగులే చేసింది. చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సిన దశలో పాక్ జట్టు 9పరుగులే చేసి చేజేతులా ఓటమిపాలైంది. అనంతరం స్వల్ప స్కోరు ను కాపాడుకోవడంలో జింబాబ్వే బౌలర్లు సమష్టిగా రాణించారు. పాక్ జట్టులో మసూద్(44), నవాజ్ (22) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. సికిందర్ రాజాకు మూడు, బ్రాడ్ ఇవాన్స్‌కు రెండు, బ్లెస్సింగ్, జాగ్వే చెరో వికెట్ తీశారు. మొత్తం ఏడుగురు బౌలర్లు బౌలింగ్ చేయడం గమనార్హం. పాక్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలవ్వడంతో సెమీస్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సికిందర్ రాజాకు లభించింది.
స్కోర్‌బోర్డు..
జింబాబ్వే ఇన్నింగ్స్: మధ్వెరా (ఎల్బి)వాసిం జూనియర్ 17, ఎర్విన్ (సి)వాసిం (బి)రవూఫ్ 19, షుంబా (సి అండ్ బి) షాదాబ్ 9, విలియమ్స్ (బి)షాదాబ్ 31, రాజా (సి)రవూఫ్ (బి)వాసిం జూనియర్ 9, ఛకబ్వా (సి)బాబర్ (బి)షాదాబ్ 0, బర్ల్ (నాటౌట్) 10, జోంగ్వే (బి)వాసిం జూనియర్ 9, బ్రాడ్ ఎర్విన్ (బి)వాసిం జూనియర్ 19, నరవా (నాటౌట్) 3, అదనం 14. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 130పరుగులు.
వికెట్ల పతనం: 1/42, 2/43, 3/64, 4/95, 5/95, 6/95, 7/95, 8/126
బౌలింగ్: షాహిన్ షా 4-0-29-0, నసీమ్ షా 4-0-34-0, వాసిం జూనియర్ 4-0-24-4, రవూఫ్ 4-1-12-1, షాదాబ్ 4-0-23-3
పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (బి)ముజరబ్బాని 14, బాబర్ (సి)బర్ల్ (బి)ఎవాన్స్ 4, మసూద్ (స్టంప్) ఛకబ్వా (సి)రాజా 44, ఇఫ్తికార్ అహ్మద్ (సి)ఛకబ్వా (బి)జోంగ్వే 5, షాదాబ్ (సి)విలియమ్స్ (బి)రాజా 17, హైదర్ అలీ (ఎల్బి) రాజా 0, నవాజ్ (సి)ఎర్విన్ (బి)బ్రాడ్ ఎర్విన్ 22, వాసిం జూనియర్ (నాటౌట్) 12, షాహిన్ షా (రనౌట్) రాజా/ఛకబ్వా 1, అదనం 10. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 129పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/23, 3/36, 4/88, 5/88, 6/94, 7/128, 8/129
బౌలింగ్: నరవా 4-0-24-0, ముజరబ్బాని 4-0-18-1, ఎర్విన్ 4-0-25-2, రాజా 4-0-25-3, జోంగ్వే 1-0-10-1, విలియమ్స్ 2-0-15-0, బర్ల్ 1-0-7-0