Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి లీగ్‌లో బ్రిటన్‌తో డ్రా
- నేడు ఆసీస్‌తో టైటిల్‌కై పోటీ
- సుల్తాన్ జొహర్ కప్ హాకీ
కౌలాలంపూర్: మలేషియా వేదికగా జరుగుతున్న 10వ సుల్తాన్ జొహర్ కప్ హాకీ ఫైన ల్లోకి భారత్ దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి మ్యాచ్‌లో భారత్ పటిష్ట గ్రేట్ బ్రిటన్ను 5-5గోల్స్‌తో నిలువరించి డ్రా చేసింది. చివరి నిమిషం వరకు ఉత్కఠభరితంగా సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు రాణించారు. ఈ టోర్నీకి భారత హాకీజట్టు జూనియర్స్ ఆట గాళ్లతో బరిలోకి దిగింది. పూవన్న(7వ ని.), అమన్‌దీప్(50వ ని.), అరైజిత్ సింగ్(53వ ని.), శ్రద్ధానంద్(56, 58వ ని.)లో భారత్ తరఫున గోల్స్ చేశారు. చివరి క్వార్టర్లో భారత్ ఏకంగా నాలుగు గోల్స్ కొట్టడం విశేషం. ఇక బ్రిటన్ తరఫున మ్యాక్స్ అండ ర్సన్(1వ, 40వ ని.), హర్రిస న్(42వ ని.), గోల్డెన్(54, 56వ ని.)లో గోల్స్ చేశారు. తొలి క్వార్టర్ ముగిసే సమ యానికి ఇరుజట్లు 1-1గోల్స్ తో సమంగా నిలువగా.. రెండో క్వార్టర్లో ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయలేక పోయాయి. మూడో క్వార్టర్లో బ్రిటన్ రెండు గోల్స్ కొట్టి 3-1 ఆధిక్యతలోకి దూసుకెళ్లగా.. నాల్గో క్వార్టర్లో ఇరుజట్లు గోల్స్ వర్షం కురిపించాయి. దీంతో భారత్ రౌండ్ రాబిన్ లీగ్ ముగిసిన అనంతరం 5 మ్యాచుల్లో 8పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక ఆస్ట్రేలియా జట్టు 4మ్యాచుల్లో 10పాయింట్లతో ఇప్పటికే ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. టోర్నీలో భారత్ 5-2తో మలేషియాపై గెలిచినా.. దక్షిణాఫ్రికా చేతిలో 4-5గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 5-5గోల్స్‌తో నిలువరించి.. జపాన్ పై 5-1తో గెలిచింది. నేడు గ్రేట్ బ్రిటన్ను 5-5గోల్స్‌తో నిలువరించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మలేషియా, జపాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2గోల్స్‌తో డ్రా కాగా.. చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6-1గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించడంతో భారత్‌కు ఫైనల్ బెర్త్ ఖాయమైంది.