Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా మరో ఘనత
బీజింగ్ : ఈ ఏడాది తొలి 9మాసాల్లో పట్టణ ప్రాంతాల్లో చైనా కోటి 10లక్షల ఉద్యోగాలను సృష్టించిందని అధికార డేటా తెలియచేసింది. ప్రస్తుతం ఉపాధి పరంగా సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ మొత్తమ్మీద ఉపాధి పరిస్థితి స్థిరంగానే వుందని కేంద్ర మానవ వనరులు, సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ తెలిపింది. ఉద్యోగాలు దొరకడం కష్టంగా వున్న 10.32లక్షల మంది జనవరి నుండి సెప్టెంబరు వరకు మధ్య కాలంలో ఉపాధి పొందారు. మరో 30.87లక్షల మంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభించాయి. ఇదే కాలంలో 7207కోట్ల యువాన్ల మొత్తం ఉపాధి సబ్సిడీలను చైనా జారీ చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్లకు సేవలందించేందుకు దేశవ్యాప్తంగా మానవ వనరులు, సామాజిక భద్రతా విభాగాలు ప్రచారాలు చేపట్టాయని, దీనివల్ల 10.02 లక్షల ఇంటర్న్షిప్ పోస్టులు ఏర్పడ్డాయని తెలిపింది.