Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీపై పుతిన్ ప్రశంసల జల్లు
మాస్కో : ఉక్రెయిన్లో సంక్షోభానికి సంబంధించి భారతదేశ విదేశాంగ విధానాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీని 'గొప్ప దేశభక్తుడు' అని అభివర్ణించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని, నాయకత్వాన్ని మెచ్చుకున్నారు. గుత్తాధిపత్యం అనంతర ప్రపంచం : ప్రతి ఒక్కరికీ న్యాయం, భద్రత'' అన్న అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో పుతిన్ ప్రసంగించారు. ''బ్రిటీష్ కాలనీ నుండి స్వతంత్ర దేశం వరకు భారతదేశ ప్రయాణం సాగింది. ఆ దేశంతో మాకు ప్రత్యేక సంబంధాలు వున్నాయి. ప్రధాని మోడీ గొప్ప దేశభక్తుడు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించగల సమర్ధుడు.'' అని పుతిన్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అంశాలపై ఈ చర్చా వేదికను 2004లో ప్రారంభించారు. ఉక్రెయిన్ ఘర్షణ వల్ల తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు గానూ 7.6 రెట్లు ఎరువుల సరఫరాలను రష్యా పెంచింది. భారత ప్రభుత్వం నుండి వచ్చిన అభ్యర్ధన మేరకే ఈ చర్య తీసుకుంది. నవంబరు 8న రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్తో సమావేశమయ్యేందుకు భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాస్కో వస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆ మరుసటి రోజునే పుతిన్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. నవంబరు 15-16 తేదీల్లో బాలిలో జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరుగుతున్నందున దానికి ముందుగా జరిగే ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సాంప్రదాయ పశ్చిమ దేశాలకు, దూకుడుతో కూడిన పశ్చిమ దేశాలకు మధ్య తేడాను పుతిన్ వివరించారు. సాంప్రదాయ పశ్చిమ దేశాలకు సుసంపన్నమైన సంస్కృతి వుందని, కానీ దూకుడుతో కూడిన పశ్చిమ దేశాలది వలసవాద దృక్పథమని అన్నారు. పశ్చిమ దేశాలతో ఘర్షణను రష్యా కోరుకోవడం లేదని అన్నారు. ''రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత కీలకమైన దశాబ్దం ఇది. పశ్చిమ దేశాలను అనుసరించాలని మిగిలిన ప్రపంచ దేశాలు భావించడం లేదని పుతిన్ వ్యాఖ్యానించారు.