Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరాచి, పెషావర్ రైల్వే ప్రాజెక్టుపై అంగీకారం
ఇస్లామాబాద్ : పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వచ్చే వారం బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు ముందుగానే కరాచీ, పెషావర్ రైల్వే లైను నిర్మాణ ప్రాజెక్టుతో ముందుకు సాగేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని మీడియా కథనాలు శుక్రవారం తెలిపాయి. బృహత్తరమైన చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడాన్ (సీపీఈసీ) ప్రాజెక్టులో ఇది కీలకమైన భాగంగా వుంది. ఈ నేపథ్యంలో గురువారం సంయుక్త సమన్వయ కమిటీ (జేసీసీ) సమావేశమై రైల్వే లైన్ ప్రాజెక్టు గురించి చర్చించింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడంలో సహకరించుకునేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. ఈ రంగంలో కొత్త అవకాశాల అన్వేషణ కోసం పాకిస్తాన్లో కొత్త పరిశోధాన కేంద్రాలను చైనా ఏర్పాటు చేయనుంది. మరో ప్రాధాన్యతా ప్రాజెక్టు అయిన కరాచీ సర్క్యులర్ రైల్వే (కేసీఆర్) పై కూడా కమిటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. జల వనరుల నిర్వహణ, వాతావరణ మార్పులపై కూడా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి, మరికొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి. కాగా, గత వారం చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో జిన్‌పింగ్ మూడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఆయనను కలుసుకుంటున్న తొలి విదేశీ నేత షరీఫ్ కానున్నారు.