Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాటూమ్ : పౌర పాలనను పునరుద్ధరించాలని కోరుతూ సుడాన్ రాజధాని జంట నగరాలైన ఖాటూమ్లోనూ, ఒమ్డుర్మన్లోనూ ఆదివారం నిరసనలు హౌరెత్తాయి. వేలాది మంది ఆందోళనకారులు ఖాటూమ్ వీధుల్లోకి వచ్చి సైనిక పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరు సల్ఫి సైనిక బలగాల చేతిలో హత్యకుగురైన వారి చిత్ర పటాలను, జాతీయ పతాకాలను చేబూని దేశాధ్యక్షుడి భవనం దిశగా భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రజలు బారీకేడ్లను ఛేదించుకుంటూ సైనిక పాలనను నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాజధాని నడిఒడ్డుకు దారితీసే వంతెన దాటేందుకు ప్రయత్నిస్తుండగా సైనిక బలగాలు ఆందోళనకారులను చెదరగొట్టారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా గతేడాది కాలంగా జరుగుతున్న ప్రదర్శనలపై సైన్యం జరిపిన దాడిలో ఇప్పటి వరకు 119 మంది ప్రజలు చనిపోయారు.