Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దోహా : సాకర్ ప్రపంచ కప్ కోసం ఖతార్ రాజధాని దోహాలో వేలాది మంది విదేశీ కార్మికులను భవనాల నుండి ఖాళీ చేయించారు. సాకర్ అభిమానుల కోసం తమ నివాసాలను ఖతార్ ప్రభుత్వం ఖాళీ చేయించిందని కార్మికులు మీడియాకు తెలిపారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల కార్మికులను వెళ్లగొట్టినట్టు సమాచారం. అంతర్జాతీయ సాకర్ టోర్నమెంట్ వచ్చే నెల 20 నుండి ప్రారంభం కానుంది. ఈ సమయంలో విదేశీ కార్మీకుల పట్ల ఖతార్ వ్యవహరిస్తున్న తీరు, నిర్బంధ చట్టాలపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దోహాలోని అల్ మన్సౌరా జిల్లాలోని ఒకే భవనానికి చెందిన 1200 మందిని కేవలం రెండు గంటల పాటు ఖాళీ చేస్తే చాలని అధికారులు చెప్పారని అన్నారు. అయితే మునిసిపల్ అధికారులు ప్రతి ఒక్కరిని బలవంతంగా బయటికి లాగి తలుపులు మూసివేశారని అన్నారు. కనీసం వారి అత్యవసర వస్తువులను తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.