Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడి
మాస్కో : బ్రిటన్, అమెరికా తదితర యుద్ధోన్మాద నాటో దేశాల ప్రోద్బలంతో ఉక్రెయిన్ సాగిస్తున్న తుంటరి చర్యలు ప్రజల ఆహార భద్రతకే మప్పు తెచ్చిపెడుతోంది. నల్ల సముద్రం మీదుగా ఆహార ధాన్యాల, ఎరువుల రవాణాకు సంబంధించి ఉక్రెయిన్‌తో చేసుకున్న ఒప్పందం ( బ్లాక్ సీ గ్రెయిన్ ఇన్సియేటివ్ : బిఎస్జిఐ) అమలును ఈ క్షణం నుంచి నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం నాడు మాస్కోలో ప్రకటించారు. ఆహార ఒప్పదంలో భాగంగా పనిచేస్తున్న తమ దేశ నౌకలపై బ్రిటీష్ అండదండలతో ఉక్రెయిన్ క్షిపణి దాడులు జరపడమే దీనికి కారణమని రష్యా ప్రభుత్వం ప్రకటించింది.