Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వల్ప గాయాలతో బయటపడిన మాజీ ప్రధాని
ఇస్లామాబాద్ : ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహిస్తుండగా, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై గురువారం ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆయన కుడికాలుకు గాయమవడంతో, ఎస్‌యువిలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాంగ్ మార్చ్ సందర్భంగా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్‌లోని గుజ్రాన్వాలా వద్ద కంటెయినర్ ట్రక్కుపైకి ఎక్కి ఇమ్రాన్ ప్రసంగిస్తుండగా, కింద నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో మరో నలుగురు పీటీఐ పార్టీ నేతలు గాయపడ్డారు. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందున ఇమ్రాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు కాల్పులు జరిపినట్టు దుండగుడు చెప్పాడు. ఇమ్రాన్‌పై కాల్పుల నేపథ్యంలో పాక్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని భారత్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి ఆరిందమ్ బగ్చి తెలిపారు.