Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న పాక్ ప్రధాని మహ్మద్ షెహబాజ్ షరీఫ్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం చర్చలు జరిపారు. అన్ని రంగాల్లో వ్యూహాత్మక సహకారం స్థాయిని మరింత పెంచేందుకు పాకిస్తాన్‌తో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా వుందని జిన్‌పింగ్ చెప్పారు. ద్వైపాక్షిక సమావేశానంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 'ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయ స్థితిగతులపై ఉభయ పక్షాలు కూలంకషంగా చర్చలు జరిపాయి. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం ప్రాధాన్యతను ఇరు పక్షాలు అంగీకరించాయి' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.