Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలెం: ఇజ్రాయిల్లో మాజీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మళ్లీ అధికారంలోకి రానున్నారు. 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి మొత్తం 120 స్థానాలకు గాను 65 స్థానాల్లో నెత న్యాహు కూటమి విజయం సాధించింది. 'మేం అతి పెద్ద విజయానికి చేరువుగా ఉన్నాం' అని జెరూసలేంలో విలేకరులతో నెతన్యాహు తెలిపారు. నెతన్యాహు కూటమిలో అతని సొంత పార్టీ లికడ్ పార్టీతో పాటు జియోనిజం, షాస్ అటిడ్ , యునైటెడ్ టారా జుడేయిజం వంటి పార్టీలు ఉన్నాయి. లికడ్ పార్టీకి 32 స్థానాలు, షాస్ అడిడ్ పార్టీకి 24 స్థానాలు లభించాయి. ఈ నెల 1న ఇజ్రాయిల్ ఎన్నికలు జరిగాయి. బుధవారం సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఇజ్రాయిల్లో గత నాలుగేళ్లలో ఎన్నికలు జరగడం ఇది ఐదోసారి.