Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధనిక దేశాలకు ఐరాస పిలుపు
పారిస్ : వాతావరణ మార్పులతో ముప్పును ఎదుర్కొంటున్న దేశాలకు, ఆ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి సహాయం కోసం నిధులను తక్షణమే పెంచాలని ధనిక దేశాలకు ఐరాస పిలుపునిచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏడాదికి 100 బిలియన్ డాలర్లు సహాయం చేస్తామని ధనిక దేశాలు వాగ్దానం చేశాయనీ, అయితే ఆ వాగ్దానంలో విఫలం చెందాయని ఐరాస విమర్శించింది. 2020లో 83 బిలియన్లు మాత్రమే అందించాయని గుర్తు చేసింది. శిలాజ ఇంధనాలను అధికంగా వినియోగిస్తున్న అభివృద్ధి చెందిన దేశాలే గ్లోబుల్ వార్మింగ్‌కు కారణమవుతున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయనీ, అయితే వాతావరణ మార్పులను కూడా ఈ దేశాలే అనుభవిస్తున్నాయని ఐరాస తెలిపింది. కరువు, వరదలు, తుపానులతో బాధపడుతున్నాయని తెలిపింది. ఈ దేశాలకు సహాయం కోసం నిధులను పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఆదివారం నుంచి ఈజిప్టులో వాతావరణ సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) చీఫ్ ఇంగర్ ఆండర్సన్ ఈ ప్రకటన చేశారు. వాతవరణ హాని కలిగించే దేశాలకు కొత్త నిధులను అందించడానికి ధనిక దేశాలు కట్టుబడి ఉండాలని కోరారు. మానవతా సహాయం, ఇతర రకాల నిధులను వాతవరణ నిధులుగా ధనిక దేశాలు పేర్కొంటున్నాయని ఆండర్సన్ ఆరోపించారు. గ్లోబుల్ వార్మింగ్ పెరుగుతున్న కొద్దీ వాతావరణ మార్పు ప్రభావాలు కూడా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.