Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాహోర్ : పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని హెహబాజ్ షరీఫ్ సహా మరో ఇద్దరు తనపై దాడికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. ఈ మేరకు పాకిస్థాన్ తెహ్రీక్ -ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ సీనియర్ నేత అసద్ ఉమర్ గురువారం అర్థరాత్రి ప్రకటించారు. షరీఫ్‌తో పాటు అంతర్గత మంత్రి సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ నజీర్ దాడికి బాధ్యులని పేర్కొన్నారు. షరీఫ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ గురువారం రాత్రి తూర్పు పాకిస్థాన్‌లోని వజీరాబాద్ అల్లావాలా చౌక్‌లో పాదయాత్ర చేపడుతుండగా ఇమ్రాన్‌ఖాన్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇమ్రాన్ కుడి కాలికి గాయమైంది. ప్రస్తుతం ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ప్రధాని మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఫైజల సుల్తాన్ పేర్కొన్నారు.