Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఉద్యోగులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తాజాగా 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ సుమారు 50 శాతం మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ఉద్యోగులు మానసికంగా దృఢంగా ఉంటారని, కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ ఓ కొత్త మార్గాన్ని అన్వేషిస్తారని చెప్పారు. చాలామందికి తనపై కోపం ఉందన్న సంగతి తెలుసని, వారు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులకు పూర్తి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే కంపెనీ సామర్థ్యాన్ని పెంచడమే తాను చేసిన తప్పు అని, అందుకు క్షమాపణలు తెలుపుతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో డోర్సే ట్విట్టర్ బోర్డు నుంచి వైదొలిగారు.