Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాదేశిక జలాల్లోకి వచ్చినందునే అరెస్టు చేశామన్న శ్రీలంక
కొలంబో : శ్రీలంక నౌకాదళం 15 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా వచ్చినందున వారిని అరెస్ట్ చేశామని శ్రీలంక ఆదివారం విడుదల చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది. మన్నార్ ద్వీపం వాయువ్య తీరంలో ఉన్న తలైమన్నార్లో మత్స్యకారులను శనివారం అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నౌకాదళం వెల్లడించింది. 32వ అంతర్జాతీయ సరిహద్దు రేఖపై భారత్, శ్రీలంక నౌకాదళాలు, కోస్ట్ గార్డ్ చర్చలు జరుపుతున్నాయని నౌకాదళం తెలిపింది. తమిళనాడు, శ్రీలంకకు మధ్య ఉన్న ప్రాంతంలో తరుచుగా ఇరు దేశాల మత్స్యకారులు సరిహద్దులను ఉల్లంఘిస్తున్నారు. గతంలో పాల్క్ జలసంధిలో భారత మత్స్యకారులపై శ్రీలంక నౌకా సిబ్బంది కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. శ్రీలంక మత్స్యకారులు కూడా భారత జలాల్లోకి తరుచుగా ప్రవేశిస్తున్నారు. వారిని ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంటోంది. రెండు దేశాల మధ్య ఉన్న పాక్ జలసంధి చేపల వేటకు అనుకూలంగా ఉండటంతో ఇరు దేశాల మత్స్యకారులు తెలియకుండానే సరిహద్దు దాటుతున్నారు.