Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాసహా 52 దేశాల వ్యతిరేకత
న్యూయార్క్ : నాజీయిజానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా, పశ్చిమ దేశాలతో సహా 52 దేశాలు ఓటు వేశాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా 105 దేశాలు ఓటు వేయగా, 15 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఐరాసలో రష్యా ప్రతినిధి వాసిలీ నెబెంజియా ప్రవేశపెట్టిన ఈ ముసాయిదా తీర్మానం నాజీయిజం, నయా-నాజీయిజం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. తీర్మానాన్ని ప్రవేశపెడుతూ రష్యన్ ప్రతినిధి నెబెంజియా మాట్లాడుతూ నాజీయిజం, జాతి వివక్ష, వలసవాదులపై వ్యతిరేక, ఇస్లామోఫోబియా, యూదు వ్యతిరేకత వృద్ధి చెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో తన సైనిక చర్యను సమర్థించుకోవడానికి రష్యా నాజీ దురాగతాలను ఉపయోగించుకుంటోందని పేర్కొంటూ అమెరికా, దాని మిత్ర దేశాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. రష్యా చరిత్రను వక్రీకరిస్తుందని ఆరోపించాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభం కాక ముందు కూడా 2021లో రష్యా ఐరాసలో ఇలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు అమెరికా, ఉక్రెయిన్ మాత్రమే వ్యతిరేకించాయి.