Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ మాత సంస్థ మెటా కూడా ఉద్యోగుల తొలగింపున కు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ వారంలోనే ఉద్వాసనలు ఉండొచ్చని తెలుస్తోంది. వేలాది ఉద్యోగుల ను ఇంటికి పంపించడానికి జాబితాను కూడా సిద్దం చేశారని వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. బుధవారమే దీనిపై ప్రకటన రానుందని సమాచారం. సెప్టెంబర్ ముగింపు నాటికి ఈ సంస్థలో 87వేల మంది పైగా ఉద్యో గులు పని చేస్తున్నారు. ట్విట్టర్ ప్రపంచ వ్యాప్తంగా 3700 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.