Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాప్27 సదస్సులో భారత్ ప్రతిపాదన
- పలు దేశాల సమర్ధన
కైరో :శిలాజ ఇంధన వినియోగాన్ని ఆపడమే వాతావరణ సమస్యలకు పరిష్కారమని భారత్ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై ఈజిప్టులో జరుగుతున్న కాప్ 27 సదస్సులో భారత్ ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రతిపాదించారు. భూతాపాన్ని కనీస స్థాయికి నియంత్రించాలన్న ప్యారిస్ ఒప్పంద లక్ష్యాన్ని సాధించాలంటే శిలాజ ఇంధన వినియోగాన్ని సాధ్యమైనంత మేర తగ్గించాల్సి ఉంటుందని భారత్ పేర్కొంది. ఒకేసారి కాకపోయినా దశలవారీగానైనా ఆ తరహా ఇంధన వినియోగాన్ని తగ్గించడం ప్రారంభించాలని, క్రమేణా పూర్తిగా మానుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ రూపొందించిన ఆరవ అంచనా నివేదికపై శని, ఆదివారాల్లో చర్చ జరిగింది. ఈ నివేదికలో వాతావరణ కాలుష్యానికి కారణమైన ఉద్గారాల విడుదల గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా స్వల్ప స్థాయి లో పెరిగే అవకాశం ఉందని పేర్కొ న్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ లో ఉద్గారాల విడుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా.