Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జి 20 సభ్య దేశాల ఆవిష్కరణ
బాలి (ఇండోనేషియా) : కోవిడ్ లాంటి విపత్తులు భవిష్యత్తులో ముంచుకొస్తే ఎదుర్కొనేందుకు వీలుగా దాదాపు రూ.11200 కోట్ల (1.4 బిలియన్ డాలర్లు)తో మహమ్మారి నిధిని జి-20 సభ్య దేశాలు ఆదివారం నాడు ప్రారంభించారు. అయితే ఈ నిధి ఏమాత్రం సరిపోదని జి20 సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో తెలిపారు. జి20 సభ్య దేశాల ఆరోగ్య, ఆర్థిక మంత్రులతో కలిసి మహమ్మారి నిధిని ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఛీఫ్ టెడ్రస్ అథనోమ్ గేబ్రేయేసస్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షులు డేవిడ్ మలపాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడొడొ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. 'మహమ్మారిని ఎదుర్కొనేందుకు వీలుగా జి20 ఒక నిధిని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. జి20 సభ్య దేశాలు, సభ్యలుగా లేని దేశాలు, దాతృత్వ సంస్థలు నిధులు సమకూర్చాయి. అయితే ఇప్పటి వరకు సమకూరిన నిధి ఏమాత్రం చాలదు' అని ఆయన పేర్కొన్నారు. తదుపరి వచ్చే మహమ్మారిని ఎదుర్కొవడానికి కనీసం రూ.248000 కోట్ల (31 బిలియన్ డాలర్లు) నిధి అవసరమని ఆయన తెలిపారు. అప్పుడే మహమ్మారిని ఎదుర్కొగలమన్న భరోసాను సమా జానికి ఇవ్వగలమని ఆయన చెప్పారు. ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే జి20 సమావేశంలోనూ మహమ్మారి నిధి కీలక అజెండాలో ఒక అంశంగా ఉంది.