Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి
వర్జీనియా : అమెరికా రాష్ట్రమైన వర్జీనియాలో యూనివర్సి టీ కేంపస్లో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వర్జీనియా యూనివర్సిటీ (యూవీఏ) ప్రధాన కేంపస్ అయిన చార్లెట్స్విల్లేను మూసివేశారు. కాల్పులు జరిపిన వ్యక్తిని ప్రమాదకరమైన వ్యక్తిగా భావిస్తున్నామని పేర్కొంటూ పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చేపట్టారని యువిఎ అత్యవసర నిర్వహణా కార్యాలయం ట్వీట్ చేసింది. యూనివర్శిటీలో విద్యార్ధి అయిన క్రిస్టొఫర్ డార్నెల్ జోన్స్ ఈ కాల్పులకు పాల్పడి వుంటాడని అనుమానిస్తున్నట్లు యువిఎ అధ్యక్షుడు జిమ్ రియాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాల్పుల కారణంగా సోమవారం తరగతులు రద్దయ్యాయి. ఇదాహో రాష్ట్రంలో జరిగిన మరో ఘటనలో నలుగురు విద్యార్ధులు మరో యూనివర్శిటీ కేంపస్కి సమీపంలో గల ఇంట్లో చనిపోయి కనిపించారని పోలీసులు తెలిపారు.