Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని దేశాలను ఒకేగాటిన కట్టే యత్నం
- తిప్పికొట్టిన భారత్, చైనా
కైరో : వాతావరణ మార్పులకు చారిత్రాత్మకంగా కారణమైన ధనిక దేశాల సరసన అభివద్ధి చెందుతున్న దేశాలను చేర్చే ప్రయత్నాన్ని భారత్, చైనాలు కలిసి తిప్పికొట్టాయి. ఈ ప్రక్రియలో మరికొన్ని దేశాలు కూడా భారత్, చైనాలకు సహకరించాయి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావారణ మార్పులపై ఈజిప్టులో జరుగుతున్న కాప్ 27 సదస్సులో చోటుచేసుకున్న ఈ సంఘటన కలలకం రేపింది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు సోమవారం ఇది చర్చనీయాంశంగా మారింది. ధనిక దేశాలు ఏదో రకంగా తమ బాధ్యత నుండి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయను విమర్శలు చెలరేగాయి. అభివద్ధి చెందుతున్న పలు దేశాల ప్రతినిధులు ఈ వైఖరినితీవ్రంగా ఖండించారు. వాతావరణ మార్పుల ఉపశమన కార్యక్రమం (మిటిగేషన్ వర్క్ ప్రోగ్రామ్) పై జరిగిన చర్చలో కర్బన ఉద్గారాలను అత్యధికంగా వెలువరించే 20 దేశాలను ఒకే గాటన కట్టడానికి ధనిక దేశాలు ప్రయత్నించాయి. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగడానికి ఈ దేశాలే కారణమని, అందువల్ల వాటిని నియంత్రించడంతో పాటు, పరిహారం చెల్లించే బాధ్యతను తీసుకోవాలని ప్రతిపాదించాయి. అమెరికాతో పాటు జర్మనీ, కెనడా తదితర ధనిక దేశాలు ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఆ 20 దేశాల జాబితాలో భారత్, చైనా వంటి అభివద్ధి చెందుతును దేశాలు కూడా ఉన్నాయి. అనూహ్యంగా చోటుచేసుకును ఈ పరిణామంతో అప్రమత్తమైన భారత్, చైనా ప్రతినిధులు వెంటనే రంగంలోకి దిగినట్లు సమాచారం. రెండు దేశాల ప్రతినిధులు సమావేశమై చర్చించడంతో పాటు, ఇతర దేశాల ప్రతినిధులతో కూడా మాట్లాడారు. దీంతో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు అభివద్ధి చెందుతును పలు ఇతర దేశాలు కూడా భారత్, చైనాలకు మద్దతుగా నిలిచాయి. దీంతో అభివద్ధి చెందుతును దేశాల గురించి విడిగా చర్చించడానికి ధనిక దేశాలు అంగీకరించాయి.
ఏమిటి నష్టం...?
పారిశ్రామిక విప్లవం ద్వారా, ఆ తరువాత ధనిక దేశాలు భారీగా లభ్ధిపొందిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అవి పెద్ద ఎత్తున కాలుష్యాన్ని విడుదల చేసి, భూ తాపం పెరగడానికి, వాతావరణ మార్పులకు కారణమయ్యాయి. భారత్, చైనా వంటి అభివద్ధి చెందుతును దేశాలు పారిశ్రామీకరణను ప్రారంభించి కొన్ని దశాబ్ధాలు మాత్రమే గడిచాయి. ఏ విధంగా చూసినా ఈ దేశాలు వెదజల్లిన కాలుష్యం ధనిక దేశాలతో పోలిస్తే తక్కువే! అందువల్ల వాతావరణ మార్పులకు చారిత్రిక బాధ్యతను ధనిక దేశాలు తీసుకోవాలని, నష్ట నివారణ చర్యల్లో ఆ దేశాలు ప్రధాన బాధ్యత పోషించాలని అభివద్ధి చెందుతును దేశాలు కోరుతున్నాయి. అవకాశం దొరికిన ప్రతిసారీ ఈ చారిత్రక బాధ్యత నుండి తప్పుకోవడానికే ధనిక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కాప్ 27 లోనూ అదే జరిగింది. 20 దేశాలపై ఒకేసారి చర్చించాలను ధనిక దేశాల ప్రతిపాదనను అంగీకరించడమంటే తమకు చారిత్రక బాధ్యతలేదను వాదనను అంగీకరించడమే! భారత్, చైనా ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించడం, మిగిలిన దేశాలు కలిసి రావడంతో ఆ ప్రమాదం తప్పింది.
లాబీయిస్టుల జోరు...
కాప్ 27 సదస్సులో లాబీయిస్టుల జోరు పెద్దఎత్తున కనిపిస్తోంది. వీరిలో కూడా శిలాజ ఇంధనాల కంపెనీల నుండి వచ్చిన ప్రతినిధులు అత్యధికంగా ఉన్నారు. గత సమావేశంలో ఈ కంపెనీల నుండి 503 మంది లాబీయిస్టులు హాజరుకాగా, తాజా కాప్‌లో వారి సంఖ్య 600 దాటింది. వివిధ అయిల్, గ్యాస్ పరిశ్రమల నుండి 636 మంది లాబీయిస్టులు కాప్27 కు అధికారికంగా రిజిస్టర్ అయ్యారు. వారితో పాటు, అనధికారికంగా మరికొందరు కూడా వచ్చినట్లు భావిస్తున్నారు. వివిధ దేశాల ప్రతినిధులను కలిసి శిలాజ ఇంధనాలకు అనుకూలంగా వారు లాబీయింగ్ చేస్తున్నారు. కాప్ 28కి ఆతిధ్యమిస్తును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1,070 మంది ప్రతినిధులను పంపింది. వారి తరువాత స్థానంలో శిలాజ ఇంధన కంపెనీల లాబీయిస్టులే ఉన్నారు.