Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : భారత్కి చెందిన యువ నిపుణుల్లో మూడు వేల మందికి వీసాలు ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అంగీకరించారు. బ్రిటన్-భారత్ యువ వృత్తినిపుణుల పథకానికి ఆమోద ముద్ర లభించిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కార్యాలయం బుధవారం వెల్లడించింది. 18 నుంచి 30ఏండ్ల వయసు కలిగిన, డిగ్రీ చదువుకున్న భారత జాతీయులు బ్రిటన్కు వచ్చి, రెండేండ్ల వరకు పనిచేసుకునేందుకు దీంతో అవకాశం కలుగుతుందని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఇటువంటి పథకంతో లబ్ది పొందుతున్న మొదటి వీసా జాతీయ దేశం భారతదేశమని బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. గతేడాది కుదిరిన బ్రిటన్-భారత్ మైగ్రేషన్, మొబిలిటీ పార్టనర్షిప్ను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించింది. బాలి సదస్సు సందర్భంగా ప్రధాని మోడీతో భేటీ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే సునాక్ ఈ ప్రకటన చేయడం విశేషం. అంతకుముందు వాణిజ్యం, మొబిలిటీ, రక్షణ, భద్రత వంటి కీలక రంగాల్లో సహకారంపై మోడీ, సునాక్లు చర్చలు జరిపారు. భారత్, బ్రిటన్ సంబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తామని సమావేశం అనంతరం మోడీ వ్యాఖ్యానించారు.