Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : ఉత్తర కొరియా గుర్తించని బాలిస్టిక్ మిసైల్‌ని ప్రయోగించిందని దక్షిణ కొరియా మిలటరీ గురువారం పేర్కొంది. ఉత్తరకొరియా చేపడుతున్న క్షిపణి పరీక్షల గురించి జి20 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించినట్లు సంగతి తెలిసిందే. అలాగే, ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు, ఆయుధాల ద్వారా ఎదురయ్యే ముప్పును పరిష్కరించడానికి బైడెన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్‌యోల్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో చర్చలు జరిపినట్లు వైట్ హైస్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇలాంటి చర్చలు కొరియాలో పరిస్థితిని అనూహ్యదిశకు తీసుకువెళుతున్నారని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చోరుసన్ హురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరకొరియా చుట్టూ మిత్రదేశాలు చేపడుతున్న సైనిక కార్యకలాపాలు, వాటికి అమెరికా ప్రోత్సహం అందించడం మూర్ఖపు చర్యలని స్థానిక మీడియా కెసిఎన్ఎతో పేర్కొన్నారు. అమెరికా, దాని మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియాలతో భద్రతా కూటమినిబలోపేతం చేయడానికి బైడెన్ ఎంతగా యత్నిస్తారో ఉత్తర కొరియా ప్రతిస్పందన అంతే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.